Thursday, December 2, 2021

Latest Posts

ముగిసిన టోక్యో ఒలింపిక్స్

Tokyo Olympics closing ceremony

టోక్యో ఒలింపిక్స్‌ 2020 నిరాడంబరంగా ముగిసాయి. ఎప్పుడు ఎంతో అట్టహాసంగా జరిగే ముగింపు వేడుకలు  కరోనా కారణంగా నిరాడంబరంగా జరిపించారు నిర్వాహకులు. జపాన్ జాతీయ స్టేడియంలో జరిగిన ఈ ముగింపు వేడుకలు కనువిందు చేశాయి. బాణసంచా వెలుగులు, జపాన్ పాప్ సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలలో హై లైట్స్. ముగింపు వేడుకలలో బాగంగా  అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు. కాగా భారత్ తరఫున రెజ్లర్ భజరంగ్ పూనియా త్రివర్ణ పతాకంతో అక్కట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్‌ కమిటి(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వణికస్తున్న సమయంలో విజయవంతంగా ఈ విశ్వక్రీడా సంబరాన్ని నిర్వహించిన టోక్యో అథ్లెట్లు కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పారిస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌కు సంబంధించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో టోక్యో మహా సంగ్రామం ముగిసింది.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss