Saturday, March 6, 2021

Latest Posts

కరోనా దెబ్బకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్

Tollywood Film Industry Stops Shooting Over Corona Effect:

టాలీవుడ్ కి కరోనా దెబ్బ తగిలింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా సమావేశం అయ్యాయి. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, సెక్రెటరీలు ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ఠాగుర్ మధు, రామసత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని, ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్‌తో పాటు, షూటింగ్స్ కూడా నిలిపివేయాలనేది మా నిర్ణయంగా భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్ర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి..’’ అని వివరించారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘‘ఎంతోమంది ప్రాణాలతో కూడిన సమస్య కావున షూటింగ్స్ ఆపాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మళ్లీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలిపితే ఆ రోజు నుంచి చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలు అందరూ స్వాగతించాలి. అందరి మంచి కోరి తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి..’’ అని ఆయన కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss