Tollywood film industry strong comments on corona effect:
ఒక్కోసారి చెడు కూడా మంచికే దారి తీస్తుంద ని అంటారు. పెద్దలు అన్నీ మనమంచికే అని ఊరికే అనలేదు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఓవైపు కరోనా కల్లోలం వల్ల ముప్పు ఎట్నుంచి ఎటాక్ చేస్తుందోనన్న ఆందోళన అందరి లో నెలకొనడంతో ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ కి సెలవులు ఇచ్చేశారు. స్కూళ్లు, కాలేజ్ లు, థియేటర్లు, వీటికి తోడు హీరోలకు కూడా షూటింగ్ కేన్సిల్ అవ్వడంతో వారికీ సెలవులు దొరికేశాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి ,సూపర్ స్టార్ మహేష్ నుంచి సందీప్ కిషన్ వరకూ అందరికీ సెలవులు దొరికేశాయి.
షూటింగులు లేకపోతే ఖాళీగా ఉన్న సమయాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేసుకోకుండా తెలివిగా వాడుకుంటున్నారు. అదేమిటంటారా ఇంట్లో ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నారు. అంతేకాదు, పనిలో పనిగా దొరికిన సినిమాలన్నీ టీవీల్లో హోమ్ థియేటర్లలో చూసేస్తున్నారు. కొందరు హీరోలు అయితే కుటుంబ సమేతంగా కూచుని ప్రొజెక్షన్ వేసుకుని మరీ చూసేస్తున్నారు. పనిలో పనిగా కొత్త దర్శకులు, రచయితలు వినిపించే కథల్ని కూడా వినేస్తున్నారట.
అసలు క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ వల్ల ఎవరైనా కథ వినిపిస్తామంటే వారాలు నెలలు తిప్పుకునేవారు. ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరికినందున అందరికీ కథలు వినే సమయం లభించింది. కాదు.. వద్దు అని తిప్పి పంపకుండా ఖాళీ సమయాల్లో స్క్రిప్టులు వినేసి అందులో నచ్చిన వాటిని సెలక్ట్ చేసి,రిజర్వ్ లో పెడుతున్నారట. ప్రతి ఒక్కరికీ స్క్రిప్టులు వినే టైమ్ ఉన్నందున మంచి వాటిని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ దొరికిందని అంటున్నారు