Tollywood producers shocking Decision on Film industry
ఎప్పుడు ఎక్కడ ఎవరిని కాటేస్తుందో తెలియని కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీంతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. థియేటర్స్ అన్నీ మూసివేయబడ్డాయి. షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిపేశారు. సినీ రంగానికి మళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో చెప్పడం కష్టంగా మారింది. కనుచూపు మేరలో ఎలాంటి ఆశలు కనిపించడం లేదు.
ఇక సినిమా థియేటర్లోకి వచ్చేది ఎప్పుడో చెప్పడం ఎవరితరం కావడం లేదు. మరోవైపు సినీ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించి విరాళాలు కూడా బానే ఇస్తున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం పేరిట సంస్థ మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో ఏర్పడింది కూడా. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో టాలీవుడ్ నిర్మాతలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
మార్చి, ఏప్రిల్లో విడుదల కావాల్సిన చిత్రాలను థియేటర్స్లో కాకుండా, స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కరోనా కారణంగా లాక్ అయిన పరిస్థితులు మళ్లీ ఎప్పుడు యథా స్థితికి వస్తాయో అని ఆలోచిస్తున్న వారంతా ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేయడమే తరువాయని అంటున్నారు.