Home సినిమా వార్తలు ఈ నెల 29 వరకు సినిమా షూటింగ్స్ లేనట్టే!

ఈ నెల 29 వరకు సినిమా షూటింగ్స్ లేనట్టే!

కరోనా ప్రభావం వలన తెలంగాణలో లాక్ డౌన్ ని ఈ నెల 29 వరకు కొనసాగిస్తున్నట్టు సి‌ఎం కే‌సి‌ఆర్ తెలియాయచేసారు. అయితే అప్పటి వరకు టాలీవుడ్ కెమెరా ఆన్ అవ్వడం కష్టం. కాగా కొన్ని రాష్ట్రాలలో కొన్ని మార్గస్దర్శకాలు, నియమాలతో కూడిన అనుమతులు ఇస్తున్నారు. అయితే అటువంటి అనుమతులైన ఉండవచ్చని భావించిన టాలీవుడ్ మెకేర్స్ ఇప్పుడు నెల అంతా వేచి చూడాల్సిన పరిస్తితి కలిగింది.

అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని సినిమా మరియు సీరియల్ ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని ఇచ్చిన అనుమతులు కొంత ఆశాభావాన్ని రేకెత్తించిన, ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో నెలకొన్న ఊహించని కరోనా కేసుల వృద్ది ఎటువంటి చర్యలకు తొందరపడకూడదని భావిస్తున్నట్టు సమాచారం. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ రామ్మోహన రావు ఈ నెల 29 వరకు షూటింగ్స్ జరపవద్దని ఆదేశించారని సమాచారం.

Tollywood Shootings Will Remain Closed Till May 29th

ఇది కూడా చదవండి: మేక్ ఇన్ ఇండియా అంటోంది అల్లు అర్జున్ “పుష్పా” టీమ్

Exit mobile version