Sunday, June 20, 2021

Latest Posts

హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్ళిన ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోలు

Tollywood Top Heroes

హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌. అయితే  ఫ్యాన్స్‌ పెద్దగా కంగారుపడాల్సిన అవసరంలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ సమయంలో చిత్రబృందంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే కోవిడ్‌ బారినపడ్డ ఐదుగురిలో మహేశ్‌బాబు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారట. దీనితో మహేశ్‌ ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారని తెలిసింది. కేవలం మహేశ్‌ మాత్రమే కాదు.. ప్రభాస్, రామ్‌చరణ్‌లు కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు.

మొన్నటివరకు ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు మన రెబెల్ స్టార్ ప్రభాస్‌. అయితే ప్రభాస్‌ మేకప్‌మ్యాన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడం తో ఆయన హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఇటీవల సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొన్నారు. అప్పుడు రామ్‌చరణ్, సోనూలపై సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు రామ్‌చరణ్‌ కూడా క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం. ఇలా ముగ్గురు టాలీవుడ్ స్టార్‌ హీరోలు హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss