Monday, April 19, 2021

Latest Posts

రేపు రాష్ట్రాల సీ.ఎం లతో మరో మారు మోదీ

Tomorrow PM Modi’s Video Conference with All CM’s

లాక్ డౌన్ విధించిన అనంతరం నుండి మోడీ సీ.ఎం లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రాష్ట్రాలలో పరిస్తితులను, కరోనా కట్టడికి తీసుకుంటున్న చేర్యాల గురించి తెలుసు కుంటున్నారు. అలాగే ప్రధాని మోదీ సోమవారం తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరో మారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది నాలుగో సారి. కానీ ఈ వీడియో కాన్ఫరెన్స్  బీహార్, ఒడిశా, గుజరాత్, ఒడిశా, హర్యానా, ఉత్తరాఖండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలతో బాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరి సీఎంలు మాత్రమే  పాల్గొననున్నారు.

కాగా పొడిగించిన లాక్ డౌన్ పైన, సడలింపులపైనా సోమవారం నాటి వీడియో  కాన్ఫరెన్స్ లో చర్చించవచ్ఛునని తెలుస్తోంది. అలాగే మే 3 న లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంతరం వలస కూలీల తరలింపు అంశం కూడా ప్రస్తావనకు రావచ్ఛు. వీరిని దశల వారీగా తరలించవచ్చునని తెలుస్తోంది. అలాగే రాష్ట్రాల సీఎంలు తమకు కేంద్రం నుంచి  ఫైనాన్షియల్ ప్యాకేజీ కోసం పట్టుబట్టే అవకాశము లేకపోలేదు.  కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమకు మరిన్ని నిధులు కావాలని అడగవచ్చు  కూడా భావిస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss