Monday, May 10, 2021

Latest Posts

టాలీవుడ్ లో పెళ్లిళ్లు –  విడాకులు….

మన తెలుగు  సినీ ఇండస్ట్రీలో ప్రేమించడం పెళ్లి చేసుకోవడం,ఆపై  విడాకులు,బ్రేక్ అప్ లు సర్వ సాధారణం. ఇక  పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా విడాకులకు దారితీసాయి.  1984లో ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మితో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జునతో వివాహం అయింది. వీరిద్దరికి మనస్పర్థలు రావడంతో 1990లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి నాగచైతన్య పుట్టాడు. విడాకులు ఇచ్చిన ఏడాది అంటి అమలను నాగ్ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.
ఇక సపోర్టింగ్ యాక్టర్  శరత్ బాబు , కమెడియన్  రమాప్రభ 1981లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే మనస్పర్ధలతో 1988లోనే విడిపోయారు.1997లో నందినిని పెళ్లాడిన పవన్ ఆ తర్వాత విడాకులిచ్చి,రేణు దేశాయ్ తో సహజీవనం చేస్తూ 2009లో పెళ్లి చేసుకున్నాడు.

2012లో రేణు కి విడాకులిచ్చి రష్యాకు చెందిన అన్నా లెజెనవా ను పెళ్లిచేసుకున్నాడు. నటి కీర్తిరెడ్డిని 2004లో ప్రేమించి  పెళ్లాడిన నాగ్ మేనల్లుడు సుమంత్ ఆతర్వాత అభిప్రాయ బేధాల కారణంగా 2006లో విడాకులు తీసుకున్నారు. మోహన్ బాబు తనయుడు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లాడాడు. కానీ  2019లో విడాకులు తీసుకున్నారు. ఇలా చూస్తే, అప్పటి నటుడు చలం – శారద కూడా పెళ్ళిచేసుకుని ఆతర్వాత విడిపోయారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss