Thursday, December 2, 2021

Latest Posts

షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరో హీరోయిన్లుగా మారిన టాప్ 10 యాక్టర్స్

Top 10 Actors Who Started Career With Short Films

చాలా మంది సినిమాల్లో నిరూపించుకోవడం కోసం ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ బాట పడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉండడంతో వారు తమని తాము నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఇలా చేస్తూ వెండి తెర పై అవకాశాలు కొట్టేస్తున్నారు. అలా షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెరీర్ ని మొదలుపెట్టి, అక్కడ ఫేమస్ అయ్యి తర్వాత సినిమాలతో పాపులర్ అయిన టాప్ 10 యాక్టర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 10 Actors Who Started Career With Short Films:

1. రాజ్ తరుణ్: 

Raj Tarun

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యిన రాజ్ తరుణ్ టాలెంట్ ఉంటే తమను తాము షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నిరూపించుకోవచ్చని చూపించిన మొదటి వ్యక్తి. ఇతను సినిమాల్లోకి రాక ముందు అనేక షార్ట్ ఫిల్మ్స్ చేసి ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నాడు.

2. విశ్వక్ సేన్:

Vishwak Sen

విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో వెండి తెరకి పరిచయమయ్యాడు. ఆ పై ఫలక్నామా దాస్, హిట్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. అయితే విశ్వక్ సేన్ సినిమాల్లోకి రాక ముందు పిట్టకథ అనే షార్ట్ ఫిలిం లో నటించాడు.

3.నవీన్ పోలిశెట్టి: 

Naveen Polishetty

జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నవీన్ పోలిశెట్టి, ఏజెంట్ ఆత్రేయ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించాడు. అయితే నవీన్ పోలిశెట్టి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాల్లో చేశాడు. ఈ జాతి రత్నాలు హీరో సినిమాల్లోకి రాక ముందు అనేక షార్ట్ ఫిల్మ్స్ లో చేశారు మరియు వీటి ద్వారా నేషనల్ వైడ్ పాపులారిటీని సాధించారు.

4. చాందినీ చౌదరి:

Chandini Chowdary

ఇటీవల వచ్చిన కలర్ ఫోటో ద్వారా తెలుగు అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి చాందినీ చౌదరి. అయితే ఈమె సినిమాల్లోకి రాక ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అయితే మధురం అనే షార్ట్ ఫిలిం ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5. సుహాస్:

Suhas

ప్రతి రోజు పండగే, మజిలీ సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రల్లో మనల్ని మెప్పించిన సుహాస్ ఆ తరువాత కలర్ ఫోటో సినిమా ద్వారా హీరో అయ్యాడు. అయితే ఇతను సినిమాల్లోకి రాక ముందు అనేక షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.

6. విజయ్ సేతుపతి: 

Vijay Sethupathi

విజయ్ సేతుపతి తాజాగా వచ్చిన ఉప్పెన, మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఒక్కోసారి ఒక్కో రోల్ లో కనిపించే విజయ్ హీరో గా కూడా సినిమాలు చేశాడు. అంతే కాదు కెరీర్ ఆరంభంలో షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ లో కూడా చేశాడు.

7. ప్రియాంక జవాల్కర్: 

priyanka jawalkar

టాక్సీవాలా సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ప్రియాంక జవాల్కర్ పొసెసివ్ నెస్, ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తన ప్రతిభను చూపి వెండి తెర పై అవకాశాలను కొట్టేసింది.

8. కిరణ్ అబ్బవరం: 

Kiran Abbavaram

రాజా వారు రాణి వారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఎస్‌ఆర్ కల్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమాల్లోకి రాక ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించేవాడు కిరణ్.

9. విజయ్ దేవరకొండ:

Vijay Devarakonda

అర్జున్ రెడ్డి ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఇంతకముందు సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ లో కనిపించాడు. ఆ తరువాత పెళ్లి చూపులు సినిమాతో హీరో గా మారాడు. సినిమాలోకి రాక ముందు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు విజయ్ దేవరకొండ.

10. రీతు వర్మ:

Ritu Varma

విజయ్ దేవరకొండ తో కలిసి పెళ్లిచూపులు సినిమాలో నటించిన రీతూ వర్మ ఆ పై నిఖిల్ సరసన కేశవలో నటించింది. ఈమె సినిమాల్లోకి రాక ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అయితే అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ తో ఆమెకు గుర్తింపు వచ్చింది.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss