Wednesday, December 1, 2021

Latest Posts

ఇంటర్నెట్ లో జాగ్రత్తగా ఉండాల్సిన 10 విషయాలు

Top 10 Things To Remember While Using Internet

ఇంటర్నెట్ భద్రత గురించి ప్రతీ ఒక్కరికీ ఆందోళనే. అయితే ఇంటర్నెట్ లో మన భద్రత ఎలా ఉన్నా మనం అసలు ఇంటర్నెట్ లో ఏం చేయకూడదో తెలుసుకుందాం. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం మన చేతిలో ఉన్నట్లు జీవిస్తున్నప్పటికీ, ఎవరైనా ఏదైనా షేర్ చేయొచ్చు అని భావిస్తారు. అయితే మన దగ్గర ఇంటర్నెట్ ఉందని ఏది పడితే అది మనం ఇంటర్నెట్ లో అంటే దానికి మనం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

సో దీనిని బట్టి మనం అసలు ఇంటర్నెట్ లో చేయకూడని పది విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రవర్తన: 
నిజ జీవితం లో వేరేగా, ఇంటర్నెట్ లో వేరుగా చెప్పడం కంటే, ఎప్పుడూ ఒకేలా ఉండడం మంచిది. నిజ జీవితంలో తెలియని మనుషులతో ఎలా అయితే పద్దతిగా మాట్లాడతారో, ఇంటర్నెట్ లో కూడా అలా చేస్తే ఎటువంటి చిక్కులు రావు.

2. సాంఘీకరణ: 

pricacy on internt 2

మీకు తెలిసిన ప్రతీ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో పంచుకుంటారు. అయితే ఇంటర్నెట్ లో తెలియని వారితో అలా చేయడం అంత మంచిది కాదు. కేవలం మీ ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకుంటే మంచిది.

3. మోసం:

Internet Top 10ప్రతిచోటా మోసం జరగడం గురించి మనం చూడడమో వినడమో జరుగుతూనే ఉంటుంది. అయితే ఇంటర్నెట్ లో ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. మనకి తెలియకుండా ఎవరైనా ఆకస్మిక బహుమతులు, ప్యాకేజీలు వస్తే మనం వాటికి కాస్త దూరంగా ఉంటాము. అలానే ఇంటర్నెట్ లో కుడా మనకి తెలీని లింకులు, ఈమెయిల్స్ ఓపెన్ చెయ్యకుండా ఉంటే మీ డేటా సేఫ్ గా ఉంటుంది. 

4. షేరింగ్:
మీ వ్యక్తిగత సమాచారం, మీ పిన్, పాస్ వర్డ్, ఓటిపి అడుగుతూ ఎవరు కాల్, మెయిల్ చెసినా కుడా మీరు అస్సలు చెప్పకండి. మీరు ఇంటర్నెట్ లో ఎవరితోనూ ఈ సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు.

5. సైన్ ఇన్, సైన్ అవుట్:

Privacyఇంటర్నెట్ లో చాలా ముఖ్యమైన విషయం. ఇంటి నుంచి బైటికి వెల్లెప్పుడు తలుపు లాక్ చేశామో లేదో అని డబుల్ చెక్ చేసుకొని వెళతాము. అలాగే మన ఖాతాలుని సైన్ అవుట్ చెయ్యడం చాలా ముఖ్యమైది దీని వల్ల మీరు ఇంటర్నెట్ నుంచి మిమ్మల్ని చాలా వరకు రక్షించుకోవచ్చు.

6. ప్రైవసీ: 

pricacy on interntవేరె వల్లా ప్రైవేట్ స్పేస్ ని గౌరవించడం మరియు వాళ్ళ పర్సనల్ మెటర్స్ లోకి వెళ్లకపోవడం అనేది నిజ ప్రపంచంలోనే కాకుండా ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా మీ కనీస బాధ్యతగా గుర్తించండి.

7. రిపోర్ట్ చేయండి: 

Reportమీకు దేని మీద అయినా అనుమానం వస్తే వెంటనే ఇంటర్నెట్ లో రిపోర్ట్ చేయండి. దాని పై వెంటనే ఆ సోషల్ మీడియా అక్కౌంట్ గాని బాంక్ వారు గాని వెంటనే యాక్షన్ తీసుకుంటారు.అక్కౌంట్ లాక్ అయ్యిందని కంగారు పడి వేరే వాళ్ళతో డేటా ని షేర్ చేయకండి దాని వల్ల పూర్తిగా మీ డేటా ను లాగేసుకుంటారు.

8.ఇతరులతో మాట్లాడటం:
మనకి తెలియని వాళ్లతో ఎంత జాగ్రతా గా మాట్లడతామో రియల్ లైఫ్ లో, ఇంటర్నెట్ లో మనకి తెలియని కొన్ని కోట్ల మందితో కూడా అంతే గౌరవంగా మాట్లాడాలి. సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్స్ పెట్టేటప్పుడు మీ పై ఎప్పుడూ ఒక కన్ను గమనిస్తూనే ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి.

9. పుకార్లు:
మనకి తెలేని విషయం గురించి ఏదైనా ఇంటర్నెట్ చెపితే వెంటనే నమ్మేయ్యకండి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అది నిజమో కాదో తెలుసుకోండి. ఇలాంటి పుకార్లు షేర్ చేయడం వల్ల పరువు నష్టం దావా కూడా వేసే అవకాశం ఉంటుందని గమనించాలి.

10. రీచ్ ఔట్ ఫ్యామిలి: 

familyమిమ్మల్ని ఇంటర్నెట్ లో ఏదైనా ఎడిపిస్తున్నా లేక వేరే ఏ విధంగా అయినా వేధిస్తున్నా వెంటనే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ని రీచ్ కండి. అంతే కానీ ఇంటర్నెట్ లో ఎవరో వేధిస్తున్నారని మీరు డబ్బులు వేయడం, ఏదో చేయడం వంటి వాటికి భయపడకండి.

ప్రతీ దానిలో మంచి మరియు చెడు ఉంటుంది. మీరు మంచి కోసం మాత్రమే ఇంటర్నెట్ వాడితే మీరు పెరుగుతున్న టెక్నాలజి తో పాటు ముందుకు వెళతారు అనే విషయాన్ని గమనించండి.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss