Tuesday, January 25, 2022

Latest Posts

బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును తిరిగి రాయగల 5 గురు స్టార్ ప్లేయర్లు

Top 5 Cricketers Who Can Break Brian Lara Record

2004 ఏప్రిల్‌ 12వ తేదీ బ్రియాన్ చార్లెస్ లారా టెస్ట్ ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కును చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో వెస్టిండీస్ 3-0తో పరాజయం పాలైంది. అయితే చివరి మ్యాచ్ లో వైట్ వాష్ నుంచి విండీస్ ని తప్పించటానికి 582 డెలివరీలను ఎదుర్కొని సుమారు 13 గంటలు పాటి 400 పరుగుల రికార్డును చేరుకున్నాడు. దీనితో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అయితే ఈ రికార్డు నెలకొల్పి పదిహేను సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు ఇది చెక్కు చెదరలేదు. కానీ ఈ రికార్డును తిరగరాసే అద్భుత ఆటగాళ్లు ప్రస్తుత క్రికెట్ లో చాలా మందే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఆ రికార్డును తిరగరాయగలిగే అవకాశం ఉన్న 5 గురు టాప్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దామా మరి.

1. స్టీవ్ స్మిత్:

Smith

స్మిత్ 126 ఇన్నింగ్స్‌లలో 7000 టెస్ట్ పరుగులకు చేరుకున్నాడు, 7000 పరుగులకు అత్యంత తొందరగా చేరుకున్న ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు స్మిత్. అతని యావరేజ్ 63.75 కూడా ప్రస్తుత క్రికెట్ లో టాప్ గా ఉంది. అయితే క్రికెట్ నుంచి బ్యాన్ తరువాత అతని ఆట పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఓర్పు, సహనం, డిఫెన్స్, అటాక్ కలగలుపుకొని బౌలర్లను ధీటుగా ఎదిరిస్తాడు. టెస్ట్ ఫార్మాట్‌లో స్మిత్‌కు 26 సెంచరీలు ఉన్నాయి. లారా రికార్డును కొల్లగొట్టే సామర్ధ్యం ఉందని అతని ఆట చూస్తే ఎవరైనా చెప్పేస్తారు.

2. విరాట్ కోహ్లీ:

Kohli
141 ఇన్నింగ్స్‌లలో 27 సెంచరీలతో, భారత కెప్టెన్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ప్రస్తుత ప్లేయర్లలో మూడు ఫార్మాట్లలో 50+ యావరేజ్ ను కలిగి ఉన్న ఏకైక బ్యాట్స్ మాన్ మన కోహ్లీ. అయితే గత సంవత్సర కాలంగా సెంచరీ కోసం ఇబ్బంది పడుతున్నప్పటికీ అతని టెక్నిక్, క్లాస్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. లారా రికార్డును చేరుకుంటాడు అని చెప్పడానికి అతను టెస్ట్ క్రికెట్ లో చేసిన 7 డబుల్ సెంచరీలు అని చెప్పాలి.

3. రోహిత్ శర్మ:

Rohit
టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్ గా ఇతను అవతారం ఎత్తినప్పటి నుండి ఇతని ఆటే మారిపోయింది. వన్డే క్రికెట్ లో మూడు డబుల్ సెంచరీలు చేసినప్పటికీ టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఓపెనర్ గా మారాకే అతను కుదుటపడ్డాడు. అయితే ఓపెనర్ గా మారక మాత్రం బౌలర్ల్కు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. ఒక్కసారి కుదురుకుంటే ఇంక ఈ బ్యాట్స్మెన్ ని ఔట్ చేయడం ఎవరి వల్ల కాదు అన్నట్లుగా ఆడతాడు. తాజాగా అతను, ఒక టెస్ట్ మ్యాచ్లో మరియు చివరికి ఒక టెస్ట్ సిరీస్లో గరిష్ట సిక్సర్ల రికార్డులను సాధించాడు. ఇతను అన్నీ కుదురుకుంటే లారా కన్నా తక్కువ బంతులలోనే 400 చెయ్యగల సమర్ధుడు.

4. మార్నస్ లాబుస్‌చగ్నే:

Marnus

యాషెస్ 2019లో స్మిత్ కి గాయం కారణంగా ఆస్ట్రేలియా టీంలో చేరాడు ఈ ప్లేయర్. అయితే వచ్చీ రావడంతోనే తన సత్తాను నిరూపించాడు. మార్నస్ లాబుస్‌చగ్నే యాషెస్లో తన మొదటి నాలుగు ఇన్నింగ్స్లో 4 అర్ధ సెంచరీలు చేశాడు. ఇతను కూడా స్మిత్ లానే మంచి టెక్నిక్ మరియు వికెట్లకు ఎదురుగా నించుని సులభంగా పరుగులను సాధిస్తాడు. స్మిత్ తర్వాత 60 యావరేజ్ కలిగిన ప్లేయర్ లాబుస్‌చగ్నే. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం ఇతనిని ఈ జాబితాలో నిలిచేలా చేసింది.

 

5. బాబర్ ఆజం:

Babr Azam

పాకిస్తాన్ యొక్క పరిమిత-ఓవర్ల కెప్టెన్ నవంబర్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ తో ఎక్కువగా గుర్తింపుని సాధించాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ అతని సెంచరీలు పాకిస్తాన్ శిబిరంలో ఆశలు నింపాయి. ఈ 26 ఏళ్ల ప్లేయర్ కవర్ డ్రైవ్‌ను విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు క్రికెట్ పండితులు, అతని టైమింగ్ మరియు స్థిరత్వం అతనిని భారీ ప్లేయర్ ని చేశాయి. బాబర్ అజామ్ క్రికెట్ లో తనకంటూ ఒక ముద్రను వేస్తున్నాడు. ఇతను కూడా 400 చేయగలిగే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు.

అయితే వీరే కాకుండా ఈ రికార్ఢును తిరిగిరాయగల సామర్ధ్యం ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss