Total cases in Andhra pradesh reaches 955 :
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్ 19 పరీక్షల్లో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 955కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 145 మంది డిశ్చార్జ్ కాగా, 29 మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 781 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో అనంపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 27, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో నమోదైన కేసులో ఎక్కువ భాగం మూడు జిల్లాలోనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 261, గుంటూరు జిల్లాలో 206, కృష్ణా జిల్లాలో 102 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
కాగా వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి “రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ తక్కువ ప్రాణ నష్టంతో AP దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అనుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. WHO కూడా ఆరా తీస్తుంది.” అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గమనించవలసిన విషయం. ఇప్పటికీ తక్కువ రికవరీ రేట్ తో ఆంధ్ర ప్రదేశ్ 6 వ స్థానంలో ఉండగా, కేరళ మొదటి స్థానంలో 70% పైగా రికవరీ రేట్ తో ఉండగా మిగిలిన స్థానాల్లో తమిళ్ నాడు, ఒడిస్సా, కర్నాటకా, తెలంగాణ ఉన్నాయి. కాగా నమోదవుతున్న కేసులు చూస్తుంటే 1200 మార్క్ ను ఈ వారంలో దాటే దిశగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ఈ దశలో వక్రీకరించి ఇటువంటి పోస్టులు పెట్టడం శోచనీయం.