Trade war start on between America and China :
అగ్రరాజ్యం అమెరికాలో రాకాసి కరోనా షేక్ చేస్తుంది. ఇప్పటివరకు 11 లక్షలకు పైగా కాసులు నమోదు అయ్యాయి. 64 వేల మందికి పైగా వైరస్ తో మృతి చెందారు. 10,785 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో 8 లక్షల 84 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు లక్ష 47 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక న్యూ యార్క్ లో పరిస్తితి దయనీయంగా ఉంది. ఈ ప్రాంతంలో 3 లక్షల పది వేలకు పైగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 24 వేల మంది పైగా న్యూ యార్క్ వాసులు కోరోనా కాటుకు బలి అయ్యారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే 2 లక్షల 37 వేల మందికి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తర్వాత స్థానంలో న్యూజెర్సీ లక్ష 18 వేల మందికి పైగా కేసులు ఉండగా, 7228 మంది మరణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పై తన మాటల దాడి కొనసాగిస్తున్నారు. ట్రంప్ సంచలన వ్యాక్యలతో ప్రపంచ అగ్ర ఆర్ధిక వ్యవస్థలయిన అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ మళ్ళీ రాసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.