లాక్ డౌన్ కారణంగా రోజువారీ పనుల మీద ఆదాయం గడించే వారు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దాదాపుగా 50రోజులు వారికి ఆదాయం లేక పోవడంతో వారి పరిస్తితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓ చిరువ్యాపారి హైదరాబాద్లోని ప్రగతి భవన్ ప్రధాన ద్వారం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన అక్కడ సిబ్బంది ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఉండడంతో అతడిపై నీటిని కుమ్మరించి అతను ఒంటికి నిప్పంటించుకోకుండా అడ్డుకున్నారు .
అనంతరం అతన్ని పోలీసులు విచారించగా తన పేరు మహ్మద్ నజీరుద్దీన్ అని మలక్ పేట్లో చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపాడు. ఉన్నట్టుంది ఒక్క సారిగా కరోనా వైరస్ విజృంభించడంతో దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చెయ్యడంతో గత రెండు నెలలుగా అతని వ్యాపారం పూర్తిగా మూతపడిందని చేసుకోవడానికి ఏ పని దొరకకపోవడంతో కుటుంబాన్ని పస్తులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని తన గోడును వెల్లగక్కాడు. తన పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ విధంగా చేశాను అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: వారిని రాష్ట్ర సరిహద్దులకు తరలించండి