Traffic Increase on Porn Sites in INDIA
కరోనా లాక్డౌన్ వేళ… భారత దేశం పోర్న్ ప్రపంచంలో మునిగితేలుతోంది. ఆఫీసులు మూతపడటం, రవాణా లేకపోవడంతో… ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలకు ఏం చెయ్యాలో తోచట్లేదు. కొంత మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా… చాలా మందికి పని లేని పరిస్థితి ఏర్పడింది. ఇక స్కూళ్లు, కాలేజీలు కూడా మూతపడటంతో… అందరూ ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అశ్లీల వెబ్సైట్లకు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం… ఆన్లైన్లో అశ్లీల సైట్ల వాడకం 95 శాతం పెరిగింది. ఇందులో 89 శాతం మంది తమ మొబైళ్ల ద్వారానే అశ్లీల వెబ్సైట్లను చూస్తున్నారు. ఇక… ఇండియాలో పోర్న్ యూజర్లలో 30-40 శాతం మంది రోజూ పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న 90 శాతం మంది తల్లిదండ్రులు… ఇంటర్నెట్ అనేది తమ పిల్లల చదువుకి బాగా ఉపయోగపడుతోందని భావిస్తున్నారు. దేశంలో ఆరు నుంచి 7 ఏడేళ్ల వయసు నుంచే పిల్లలు మొబైల్ ద్వారా ఇంటర్నెట్కి అలవాటు పడుతున్నారు. ఇండియాలో 4జీ ఇంటర్నెట్ కాస్త చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత… మొబైల్ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. అదే సమయంలో… డేటింగ్ సైట్లు, బూతు సైట్లు కూడా ఎక్కువయ్యాయి. ఇలా అదే పనిగా అశ్లీల దృశ్యాలు చూసేవాళ్లు… వాటికి బానిసలై… ఒకరకమైన మానసిక సమస్యలు వస్తాయంంటున్నారు నిపుణులు.