Friday, January 22, 2021

Latest Posts

ట్రాఫిక్ పోలీస్ తనిఖీతో తప్పిపోయిన భార్య

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు చేపడుతున్న తనిఖీలు ఓ జంటను ఇరకాటంలో పడేశాయి. ఆదివారం శంషాబాద్ వద్ద ఓ జంట బైక్‌పై షాద్‌నగర్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపడుతుండటాన్ని చూశారు. భర్తకు హెల్మెట్‌ ఉంది కానీ, భార్యకు లేదు. దీంతో ఆ జంట ముందుకు పోలేక..వెనక్కి వెళ్లలేక ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భర్త తన భార్యను బస్సెక్కించాడు.

అంతా బానే ఉంది కానీ ఇక్కడే చిన్న ఇరకాటం వచ్చింది. శంషాబాద్‌లో బస్సు దిగాల్సిన భార్య అక్కడ దిగకుండా సాతంరాయి వద్ద బస్సు దిగింది. అక్కడ నుంచి తిరిగి శంషాబాద్‌ రావడానికి ఆటో ఎక్కగా ఆటో వాడు కాస్త ఆమెను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దించేశాడు. అయితే ఎయిర్‌పోర్టులో దిగిన సదరు మహిళ తాను తప్పిపోయానని తెలుసుకుని ఏడుస్తుండటంతో ఆమెను గమనించిన పోలీసులు షీ టీమ్‌కు అప్పగించగా వారు పూర్తి వివరాలు తెలుసుకుని ఆమెను తిరిగి భర్తకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss