హైదరాబాద్: ప్యాసింజర్ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ టికెట్లను రద్దు చేశారు. జూన్ 30 వరకు బుకింగ్ అయిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ఇవాళ రైల్వే శాఖ వెల్లడించింది. ఆ ప్రయాణికులకు మొత్తం ఛార్జీని రిఫండ్ చేయనున్నారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ ఓ ప్రటకన ద్వారా తెలియజేసింది. అయితే శ్రామిక్ రైళ్లను మాత్రం కొనసాగించనున్నట్లు తెలిపారు. శ్రామిక్ రైళ్ల ద్వారా వలస కూలీలను తరలిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి 15 ప్రాంతాలకు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను కూడా కొనసాగించనున్నారు. రైల్వేశాఖ లెక్కల ప్రకారం.. గత నెలలో సుమారు 94 లక్షల టికెట్లకు సంబంధించి 1490 కోట్లను రిఫండ్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 మధ్య తేదీలకు సంబంధించి మరో 830 కోట్లను రిఫండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రకాల రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: వారు నాపై చూపించిన ప్రేమ అమూల్యం: శేఖర్ కమ్ముల