Wednesday, June 23, 2021

Latest Posts

ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై.. ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..

ఓ వైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంటే.. మరోవైపు ఏపీ ప్రజలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ నెలలో వచ్చిన కరెంట్ బిల్ చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ మేరకు ఏ‌పి ట్రాన్స్కో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 45 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. నిబంధన ప్రకారం బిల్లు జారీ చేసినప్పటి నుంచి 15 రోజుల్లోపు చెల్లించాలని తెలిపారు.

కోవిద్-19 నేపథ్యంలో జూన్ 15 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లులపై ఏవైనా అనుమానాలు ఉంటే 1912 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. కాగా ఈ నెల విద్యుత్ బిల్లులు భారీగా వచ్చాయని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కరోనా ఎఫెక్ట్….న్యాయవాదులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss