Monday, May 10, 2021

Latest Posts

మంచి  కాంబినేషన్ ..  కానీ ఆ  మూవీ ప్లాప్స్…..

కొందరు హీరో హీరోయిన్స్  జంట సినిమాల్లో కల్సి చేస్తే , హిట్ ఫెయిర్ గా నిలుస్తాయి. కానీ   ఫలానా హీరోయిన్ తో తమ అభిమాన నటుడు నటిస్తే చూడాలని ఫాన్స్ ఎదురుచూస్తుంటారు. తీరా కల్సి నటిస్తే ఆ మూవీ డిజాస్టర్ అయిపోతుంది. ఈకోవలోకి వచ్చే వాటిని ఒకసారి పరిశీలిద్దాం. చిరంజీవి , అప్పట్లో యూత్ కి కలలరాణి సిమ్రాన్ కల్సి మృగరాజు మూవీ చేసారు.  కానీ ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.  పవన్ కళ్యాణ్ , అప్పట్లో తిరుగులేని హీరోయిన్   త్రిష కల్సి బంగారం మూవీ చేసారు.  కానీ బంగారం మూవీ నిరాశ పరిచింది. ఆతర్వాత తీన్ మార్ మూవీ చేసినా ఫలితం దక్కలేదు.

జూనియర్ ఎన్టీఆర్ ,హన్సిక కల్సి మెహర్ రమేష్ డైరెక్షన్ లో  కంత్రీ మూవీలో చేసారు.  ఆసమయంలో హన్సిక క్రేజ్ అదిరిపోతోంది. దీంతో ఫాన్స్ ఎక్కువగా అంచనాలు వేసుకున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిన ,సినిమా తీవ్ర నిరాశ పరిచింది. పోకిరి మూవీ తర్వాత  క్రేజ్ అమాంతం పెరిగిన ఇలియానా,  ప్రభాస్ సరసన నటిస్తే బాగుండునని ఫాన్స్ ఎదురుచూసారు. మున్నా మూవీ ప్రకటించడమతొ  ఫాన్స్ లో అంచనాలు పెరిగాయి. కానీ ఈ మూవీ  ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

లక్ష్మి మూవీలో వెంకటేష్,నయనతార  కల్సి నటించడంతో సూపర్ హిట్ అయింది. అయితే మరోసారి కల్సి నటించాలని ఫాన్స్ భావించడంతో  బాబు బంగారం  మూవీ చేస్తే అది డిజాస్టర్ అయింది. ఖలేజా మూవీలో అనుష్క ,మహేష్ కల్సి నటించారు. ఇద్దరి రొమాన్స్ ఫాన్స్ బానే ఎంజాయ్ చేసినా, సినిమా ప్లాప్ అయింది.   తమన్నా ,అల్లు అర్జున్ కల్సి తొలిసారి చేసిన బద్రీనాధ్ మూవీ ఫాన్స్ లో ఎన్నో అంచనాల పెంచింది. కానీ ఈ   మూవీ ఘోరంగా దెబ్బతింది. అలాగే అల్లు అర్జున్,కాజల్ అగర్వాల్ కల్సి సుకుమార్ డైరెక్షన్ లో  నటించిన ఆర్య 2మూవీ దెబ్బతింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss