Home సినిమా వార్తలు రూట్ మార్చిన త్రివిక్రమ్

రూట్ మార్చిన త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు తన రూట్ ని మార్చుకున్నారా? తన సినిమాను 9 నెలల నుంచి సంవత్సరం పాటు తీసే త్రివిక్రమ్ ఇప్పుడు వేగం పెంచనున్నారా? అయితే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎటువంటి షూటింగ్ మొదలుపెట్టలేదు. “అలా వైకుంఠపురములో” సినిమాతో ఇండస్ట్రి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ చేతిలో టాలీవుడ్ స్టార్ హీరోలు వెయిటింగ్ లో ఉన్నారు. ఎన్‌టి‌ఆర్ తో తన తదుపరి చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ తరువాత వెంకటేష్ ను డైరెక్ట్ చెయ్యనున్నారు. దీని తర్వాత మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాను పట్టలేక్కించే అవకాశం ఉంది. ఆ తర్వాత హట్రిక్ హిట్ మిస్ చేసుకున్న కాంబినేషన్ పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ మరో సినిమాను తియ్యనున్నాడు. ఇది కాగానే ఇప్పటి వరకు డైరెక్ట్ చెయ్యని హీరో రామ్ చరణ్ తేజ్ ను డైరెక్ట్ చెయ్యనున్నాడు త్రివిక్రమ్. కాగా రాబోయే 5 సంవత్సరాల పాటు త్రివిక్రమ్ బిజీ బిజీ గా గడుపనున్నాడు.

ఇది కూడా చదవండి: 

Exit mobile version