Thursday, May 13, 2021

Latest Posts

త్రివిక్రమ్ కి నచ్చిన సాంగ్ ఆ సినిమా కోసమేనట

మాటల మాంత్రికుడు, పుస్తకాల పురుగు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం అల వైకుంఠపురంలో ఈ సంక్రాంతి బరిలో నిలిచి దుమ్మురేపింది. అటు బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఇటు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ఈ చిత్రంలో మ్యూజిక్ గురించి చెప్పాలంటే,ఈ సినిమా విడుదలకు ముందే వచ్చిన పాటలు కుర్రకారును ఉర్రూతలూగించాయి. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో టాప్ పొజిషన్ లో నిలిచాయి. ఇప్పటికీ అందరి నోళ్లలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్ అయితే ఎక్కడలేని పేరు మోసుకొచ్చింది.

ఈ పాటలో ట్యూన్స్ గానీ, పాట చిత్రీకరణగానీ సూపర్ డూపర్ గా నిల్చింది. ఇక పాటల్లో సాహిత్యం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. సినీ వర్గాలతోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమాలో పాటలు ఇంతగా అలరించడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంచుకున్న పాటల రచయితలు. ఎందుకంటే ఆయనకు సాహిత్యంపై అపారమైన పట్టు ఉంది. ఈ విషయం ఆయన గత సినిమాల్లోనూ అర్థమవుతుంది. ఇక బుట్ట బొమ్మ బొమ్మ పాటను సీనియర్ రచయిత రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటలో పదాలతో ఆయన పదనిసలు చేశారని సాహితీ ప్రియులే ఒప్పుకుంటున్నారు.

తాజాగా రామ్ జోగయ్య శాస్త్రి ట్విట్టర్ లో స్వయంగా ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. “త్రివిక్రమ్ గారు నిన్న ఒక పాట వింటూ ఇది రామ్ జోది కదా అని గుర్తు పట్టారంట. సంతోషం అనిపించింది. నిలిచిపోయే పాట అవుతుందని చెప్పారు ఆయన… నిజంగానే“ అంటూ ట్వీట్ చేశారు. అయితే త్రివిక్రమ్ మనసుదోచిన ఆ పాట ఏ చిత్రం లొదంటే, పవర్ స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రంలోనిదేనని ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాదు, ఆ పాట ఎప్పుడు వింటామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ జొ గారు కూడా కొన్ని రోజులుగా ఈ సినిమా పాట కోసం కొన్ని హింట్లు ఇవ్వడంతో, ఫాలో అవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss