Thursday, December 2, 2021

Latest Posts

గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎన్నిక

TRS Elects Gellu Srinivas Yadav As Huzurabad Candidate

త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ యాదవ సమాజానికి చెందిన వ్యక్తికి ఈ ఉప ఎన్నికల టికెట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మంత్రి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  బిజెపికి ఓటు వేయడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే వారు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించకరని అన్నారు. ఇంద్రవెల్లి సమావేశంలో సిఎం కే‌సి‌ఆర్ ను విమర్శించినందుకు కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ను వీడి ఈటెల బీజేపీలో చేరడం మరియు కాంగ్రెస్‌ పార్టీలో ఉండాల్సిన కౌశిక్‌రెడ్డి టి‌ఆర్‌ఎస్ లోకి రావడం అక్కడి వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఎలా అయినా విజయం సాధించాలని టి‌ఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. నిన్న దళిత బందు పథకం కింద నియోజకవర్గం ప్రజలకు 500 కోట్లు విడుదల చేసింది. తాజాగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ ని ఎన్నికల్లో నిలబెడుతున్నట్లుగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss