Sunday, July 25, 2021

Latest Posts

తనను చంపడానికి చూస్తున్న మంత్రి – ఈటెల రాజేందర్

తనను చంపడానికి టిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ అధికార పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ‘పాదయాత్ర’ను ప్రారంభించారు.

తన పాదయాత్ర ప్రారంభంలో ఈటెల మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టీ మంత్రి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇందుకోసం మంత్రి ప్రైవేటు గ్యాంగ్‌స్టర్లతో మాట్లాడుతున్నారు. ఈ రకమైన బెదిరింపులు నాకు కొత్త కాదు. నేను చాలా భయంకరమైన గ్యాంగ్ స్టర్ అయిన నయీమ్ నే లెక్కచెయ్యలేదు. మీ లాంటి బెదిరింపులకు భయపడను నేను అని చెప్పారు.

అధికార పార్టీకి సలహా ఇస్తూ, కెటిఆర్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలను మానుకోవడం మంచిదని, లేకపోతే నా ఆత్మగౌరవం కోసం పోరాడటానికి నేను ఏ మేరకు అయినా వెళ్తాను అని ఈటెల తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని, దుబ్బాక ఫలితం ఖచ్చితంగా పునరావృతమవుతుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss