Wednesday, April 21, 2021

Latest Posts

హుజూర్ నగర్ లో కేసీఆర్ కి సి‌పి‌ఐ మద్దత్తు నిరాకరణ..!!

TRS seeks support of CPI in Huzurnagar bye election:

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని సీపీఐ పార్టీ నిర్ణయించింది. ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఇప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ అల్టీమేటం వేసింది. ఇందుకు ఈనెల 13వ తేదీని గడువుగా విధించింది. అయితే ప్రభుత్వం నుంచి గానీ, టీఆర్ఎస్ నుంచి గానీ ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ ఇక్కడి పార్టీ కార్యాలయంలో నేడు అత్యవసర సమావేశం అయింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా చర్చించారు. సుధీర్ఘ చర్చల అనంతరం టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని మెజార్టీ కార్యవర్గం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి వల్లే మద్దతు ఉపసంహరణకు కారణమని సీపీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించే బదులు ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడింది. 48వేల మంది కార్మికులను తొలగించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. ఆర్టీసీ ఉద్యమంలో అగ్రభాగాన ఉండాలని నిర్ణయించామంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామంది. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ చర్చలకు పిలవాలని సీపీఐ డిమాండ్ చేసింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss