అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన తెలుగు బాలికకు ప్రశంసా పత్రాన్ని అందచేశారు. కరోనా సమయంలో అమెరికాలోని మేరీలాండ్ లో కరోనా వారియర్స్ అయిన డాక్టర్లు, సానిటరీ వర్కర్లకు, పోలీసులకు మరియు వైద్య సిబ్బందికి తన వంతు సాయంగా కుకీలు పంచిపెట్టి ముందుండి ఇటువంటి సహాయం చేసిన శ్రావ్య అన్నపురెడ్డికి, దీనికి కాను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసా పత్రాన్ని అందించారు.
10 ఏళ్ల శ్రావ్య అన్నపురెడ్డి మన తెలుగు బాలిక, అమెరికాలో తోటి గర్ల్స్ స్కౌట్స్ బృందంతో కలిసి అగ్నిమాపక సిబ్బందికి, నర్సులకు కుకీలను అందచేయగా ఈ టీమ్ అయిన లైలా, శ్రావ్య అన్నపురెడ్డి, లోరేన్ లను ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశంసించారు. కాగా శ్రావ్య అన్నపురెడ్డి తల్లి తండ్రులు డా. శీతాకలాం విజయ్‌రెడ్డి అన్నపురెడ్డి అమెరికాలో వైద్యులుగా సేవలందిస్తున్నారు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్ల కావడం విశేషం.
ఇది కూడా చదవండి: ఈ రోజే తెలంగాణ కేబినెట్ సమావేశం