Sunday, March 7, 2021

Latest Posts

భారత్ సుంకాలపై విరుచుకుపడ్డ ట్రంప్

Trump fires on India High tariffs:

గత ఏడాది జూలైలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అల్మండ్, యాపిల్స్ సహా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్ పన్నులు విధించింది. దీంతో అమెరికా గుర్రుమంది. అందుకే అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేస్తోందని అడపాదడపా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడడం తెల్సిందే.

దీంతో వాణిజ్య ఉద్రిక్తలు తలెత్తాయి. రెండు దేశాల మధ్యా సమావేశాలు, వాణిజ్య సంప్రదింపులు జరిగాయి. అయితే ఇప్పటికీ రెండు దేశాల మధ్య ఒక అవగాహన కుదరలేదు. అయితే భారత్ పర్యటనకు వచ్చిన సందర్బంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారత్ పై తన అక్కసు వెళ్లగక్కారు. మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో భారత్‌పై నిశిత విమర్శలు చేశారు.

‘మాపై పెద్ద మొత్తంలో సుంకాలు వేస్తున్నారు. వాళ్లు మాత్రం ఆ స్థాయిలో సుంకాలు చెల్లించడం లేదు’ అని ‘బహుశా…అత్యధిక టారిఫ్ వసూలు చేస్తున్న దేశం ఇండియానే’ అని ఆయన పేర్కొన్నారు. హార్లీ-డేవిడ్‌సన్ భారత్‌కు మోటార్‌ వాహనాలు పంపినప్పుడు పెద్ద మొత్తంలో సుంకాలు చెల్లిస్తుంటుందని, ఇండియా మాకు పంపినప్పడు అసలు సుంకమే ఉండదని, ఇది సమంజసం కాదని అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss