Trump is unaware of Kim’s health condition
అంతర్జాతీయ మీడియాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై రకరకాలు వార్తలు బయటికొచ్చాయి. ఆ వార్తలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తనకు కిమ్ జాంగ్‌తో సత్సంబంధాలు ఉన్నాయని, తాను బాగుండాలని కోరుకుంటున్నానని వైట్ హౌస్‌లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. కిమ్ పరిస్థితి విషమంగా ఉందని వార్తలొస్తున్నాయని అయితే ఎవరూ ఈ విషయాన్ని ధృవీకరించలేదని, కొన్ని రిపోర్టులు బయటికొస్తున్నాయని, ఐతే తమకూ కిమ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ తెలియదని ట్రంప్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మీడియ వార్తల ప్రకారం కిమ్‌కు ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉత్తర కొరియా మీడియా మాత్రం మౌనం వహిస్తుండటం గమనార్హం. ఏప్రిల్ 15న జరిగిన తన తాతయ్య జన్మదిన వేడుకలకు కూడా కిమ్ హాజరు కాకపోవడం ఈ వార్తలకు ఊతాన్నిస్తోంది. అయితే ధూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి కారణంగా కిమ్ ఆరోగ్యం క్షీణించిందనీ, ఏప్రిల్ 12న ఆయనకు హృదయ సంబంధిత ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని దక్షిణ కొరియాకు చెందిన ఓ వార్తా వెబ్ సైట్ మొదటి సరిగా కిమ్‌కు సంబంధించిన వార్తను ప్రచురించింది.