న్యూయార్క్: ఇన్నాళ్లు కరోనా వైరస్‌ను లెక్కచేయని ట్రంప్‌కు కొవిడ్-19 సెగ తాకినట్లుంది. అధికారిక కార్యకలాపాల కోసం ఇకపై తన వద్దకు వచ్చే ప్రతిఒక్కరు మూతికి మాస్క్ ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌హౌస్ పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కరోనా బారిన పడకుండా రక్షించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతవారం ట్రంప్ మిలటరీ వాలెట్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మీడియా కార్యదర్శి ఇద్దరూ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: డిసెంబర్ నాటికి కరోనా వైరస్‌కు అమెరికా వ్యాక్సిన్