Monday, May 10, 2021

Latest Posts

డబ్ల్యూహెచ్ఓ కు  నిధులు నిలిపేసి, పైగా విచారణ కూడా 

Trump Threatens to Withhold U.S. Funding for World Health organization

చైనాలో విజృభించిన   కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కొన్ని విషయాలు చెప్పకుండా సీక్రెట్ గా వ్యవహరించిందంటూ ఆరోపించిన  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతటి ఆగకుండా   నిధులు నిలిపివేస్తామంటూ ఇటీవల హెచ్చరిక కూడా చేసారు. అయితే  ఆయన అన్నంత పనీ చేశారు. డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా ఇచ్చే నిధులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా ప్రమాదాన్ని కప్పి పుచ్చేందుకు జరిగిన ప్రయత్నంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ర ఎంతుందనే దానిపై కూడా సమీక్షకు ఆదేశించారు.  ‘డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా తరఫున అందే నిధులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించాను. కరోనా వ్యాప్తిని కప్పిపుచ్చేందుకు జరిగిన ప్రయత్నంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ర ఎంత ఉందనే దానిపై కూడా సమీక్ష నిర్వహిస్తాం. అసలు అక్కడ జరిగిందేమిటో అందరికీ తెలుసు’  అని శ్వేత శౌధంలో జరిగిన మీడియా మీట్ లో  ట్రంప్ వ్యాఖ్యానించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు వంత పాడుతూ కరోనా ప్రమాదాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేసిందని ట్రంప్ తొలి నుంచీ ఆరోపిస్తున్నారు. అమెరికా ద్వారా డబ్ల్యూహెచ్ఓకు ఏటా 400 నుంచి 500 మిలియన్ల డాలర్లు అందుతుంటే చైనా కేవలం 40 మిలియన్ డాలర్లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. ‘అత్యధిక నిధులిచ్చే దేశంగా అమెరికాకకు డబ్ల్యూహెచ్ఓ నిబద్ధతతో పనిచేయాలని కోరే హక్కు ఉంది. అయితే చైనాతో ఉన్న సరిహద్దులను మూసేయద్దంటూ డబ్ల్యూహెచ్ఓ చేసిన సూచన అత్యంత ప్రమాదకరమైనది. సరిహద్దులు మూసేయాలనే అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగాం’ అన్ని ట్రంప్ చెప్పుకొచ్చారు.‘ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రమాదాలకు సంబంధించి అనేక దేశాలుడబ్ల్యూహెచ్ఓపై ఆధారపడతాయ ని అయితే తన కనీస బాధ్యత నిర్వహించడంలో అది విఫలమైంద ని ఆయన వింవర్శించారు. ఈ వైఫల్యానికి డబ్ల్యూహెచ్ఓ పూర్తి బాధ్యత వహించాలన్నారు.

“మనుషుల ద్వారా కరోనా వ్యాపించదంటూ జనవరిలో అనేక సార్లు డబ్ల్యూహెచ్‌ఓ చిలక పలుకులు పలికింది. అయితే క్షేత్రస్థాయిలో లభ్యమైన సమాచారం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. కరోనా విషయంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించడంలో, నిపుణులను శాస్త్రవేత్తలను రంగంలోకి దింపడంలో చాలా ఆలస్యం అయింది.  చైనా నుంచి సరైన సమయంలో వైరస్ శాంపిల్స్‌  డబ్ల్యూహెచ్ఓ సేకరించలేకపోవడంతో  వైరస్‌కు సంబంధించి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలకు సరైన సమాచారం అందలేదు. పైగా  కరోనా సంక్షోభం తొలి దశలో ఉండగా ప్రపంచ దేశాలకు తప్పుడు సమాచారం అందిందనేది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తన బాధ్యత నిర్వర్తించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిష్ఫాక్షికంగా వ్యవహరించి ఉంటే, క్షేత్రస్థాయి పరిశీలనకు వైద్య నిపుణులను చైనాకు వెను వెంటనే పంపించి ఉంటే ఈ మహమ్మారిని సులువుగా కట్టడి చేసి ఉండేవాళ్లం. మరణాల సంఖ్య తక్కువగా ఉండేది.  చైనా చెబుతున్న విషయాలతో డబ్ల్యూహెచ్ఓ  ఏకిభవిస్తూ ఆ దేశాన్ని వెనకేసుకొచ్చింది. చైనా నుంచి వస్తున్న తప్పుడు సమాచారం వ్యాప్తికి కారణమైంది. చైనా తీసుకుంటున్న చర్యలను పొగిడింది. మనుషుల ద్వరా కరోనా వ్యాపించదని, చైనా నుంచి రాకపోకలు నిషేధించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 20 రెట్లు పెరిగాయి’ అని ట్రంప్ తీవ్రంగా  ఆరోపించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss