Tuesday, April 13, 2021

Latest Posts

దసరా నాటికి పేదలకు లక్ష ఇళ్లు అందజేస్తాం – కే‌టి‌ఆర్

ఆగస్టు నాటికి 50 వేల ఇళ్లు, దసరా నాటికి మరో 50 వేల ఇళ్లను పూర్తి చేసి, మొత్తం లక్ష ఇళ్లను పేదలకు అందిస్తామని గ్రేటర్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంపై బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం  రాష్ట్ర మునిసిపల్‌,పట్టణాభివృద్ధి మంత్రి కే‌.టి.‌ఆర్ తెలిపారు. లాక్‌ డౌన్‌లోను డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, అయితే స్టీలు, సిమెంటు, ఇసుక లభ్యత ఇబ్బందులు ఉన్నాయని నిర్మాణ సంస్థలు మంత్రి దృష్టికి తేవడంతో దీనిపై సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కారానికి తగిన సలహాలు సూచనలతో ముందుకు వెళ్లాలని గృహ నిర్మాణ శాఖాధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.

ఇప్పటికే 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని, అన్ని శాఖల సమన్వయంతో మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన తదుపరి జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని, గ్రేటర్‌ పరిధిలో తలపెట్టిన లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం సమీక్షిస్తున్నామని,ఆగస్టు లో 50 వేల ఇళ్లను మిగతా 50 వేల ఇళ్లను దసరా నాటికి పూర్తి చేసి పేదలకు అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పేదలకు లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పస్టం చేశారు. అలాగే గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికే 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss