TS government on saturday issued orders to call vanakalam and yasangi
ఇకపై ఖరీఫ్, రబీ పదాలకు బదులుగా వ్యవసాయ సీజన్లు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వానాకాలం, యాసంగిగా మారుస్తు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ముఖ్యమంత్రి సమక్షంలో ఆమోదం తెలిపారు.
దీంతో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పోరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు పంట సీజన్ల పేర్ల మార్పుపై సూచన చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు సామాన్యులకే కాదు, చదువుకున్న వారికీ కూడా ఖరీఫ్, రబీ పదాలను వాడే విషయంలో గందరగోళం నెలకొంటున్న సంగతి విధితమే. ఇకనుండి శాఖపరమైన ఉత్తర్వులు, పత్రాలలో వానాకాలం, యాసంగి పదాలనే వాడాల్సి ఉంటుంది.