Sunday, June 20, 2021

Latest Posts

ప్రైవేట్ ఆసుపత్రులకి ఇచ్చిన షో-కాజ్ నోటీసులు వెనక్కి

TS High Court Soft Corner On Private Hospitals

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టడంలో విఫలమైందని చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. అయితే దీనిని నియంత్రించడానికి తెలంగాణ హైకోర్టు చాలా చర్యలను తీసుకుంది. అనేక సందర్భాల్లో, హైకోర్టు ప్రభుత్వ ఆలస్య చర్యల పై విరుచుకుపడింది హైకోర్టు మరియు ‘సెకండ్ వేవ్’ కట్టడికి ప్రభుత్వ సంసిద్ధతను ప్రశ్నించింది.

కానీ ఆశ్చర్యకరంగా, తెలంగాణ హైకోర్టు ప్రైవేట్ ఆస్పత్రుల పై మృదువుగా వ్యవహరించింది హైకోర్టు. ప్రైవేట్ ఆసుపత్రులకు జారీ చేసిన షో-కాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సూచించింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులపై వందలాది ఫిర్యాదులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ -19 చికిత్స కోసం 22 ఆస్పత్రుల లైసెన్సులను నిలిపివేసింది మరియు కొన్ని ఆసుపత్రులకు నోటీసులను జారీ చేసింది.

దీనివల్ల రాష్ట్రంలోని జంట నగరాల్లో బెడ్స్ కొరత ఏర్పడింది. దీనితో తెలంగాణ హైకోర్టు ఈ సూచన చేసింది. దీని ప్రకారం నోటీసులను ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకుంటామని, కాని ప్రభుత్వం ఆసుపత్రులపై విచారణ కొనసాగిస్తుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలియజేశారు.

అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని హైకోర్టు అడ్డుకోవడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజల పై ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడీ గురించి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss