Monday, March 8, 2021

Latest Posts

మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి షాక్ ఇస్తున్న పోలీసులు

యావత్ ప్రపంచ దేశం మొత్తంను క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి  పట్టిపీడిస్తున్న తరుణంలో మన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్న బిన్నం అయిపోయింది.  కోవిడ్ 19 వ్యాప్తిపై ప్ర‌జ‌ల్లో ఎంత‌గా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా ప్ర‌జ‌లు ఇళ్ల నుండి బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నప్పటికి అంతకు అంత క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతునే ఉన్నాయి. దీంతో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌రోనా ప్ర‌భావం బాగా ఉన్న ప్రాంతాల‌లో మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ నిబంధ‌న‌లు కఠినంగా  పాటించ‌క‌పోయినా, మాస్క్‌లేకుండా రోడ్ల‌పైకి వ‌చ్చిన వారి ప‌ట్ల తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్  లేకుండ రోడ్ల‌పైకి వస్తే  వెయ్యి జరిమానా అన్న వాటిని ఏమాత్రం లెక్క చేయడం లేదు, మళ్ళీ మళ్ళీ మాస్క్ లేకుండ వస్తానే  ఉన్నారు.  అయితే వారికోసం పోలీసులు ఇప్పుడు కేసులు కూడా త‌ప్ప‌వంటున్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో రోడ్ల‌పైకి వ‌స్తే ఖ‌చ్చితంగా మాస్కులు ధ‌రించాల‌ని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మాస్కులు లేకుండా రోడ్ల‌పై తిరుగుతున్న వారిని బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్ గ‌స్తీ సిబ్బంది ద్వారా గ‌ర్తించి కేసులు పెడుతున్నారు. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌, సెక్ష‌న్ 51(బి) కింద ఈ నెల 7 నుంచి నిన్న‌టి వ‌ర‌కు మాస్కులు పెట్టుకోని 4,719 మందిపై కేసులు పెట్టారు.

ఇది కూడా చదవండి: కరోనా ఎఫెక్ట్….న్యాయవాదులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss