ఖమ్మం: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. లాక్డౌన్ 4.0 సండలింపుల్లో భాగంగా దాదాపు రెండు నెలల విరామం తర్వాత ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సేవల్ని స్వయంగా పర్యవేక్షించేందుకు ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌ను మంత్రి బుధవారం అకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి మాట్లాడారు. అదేవిధంగా ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారుల్ని ఆరా తీశారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు విధిగా మాస్కులు, శానిటైజర్లు అందజేసే బాధ్యత డీఎంలదేనని ఆయన స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించి బస్సుల్లో ప్రయాణించాలని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.
ఇది కూడా చదవండి: