తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని జిల్లాల్లో రేపటి నుంచి రోడ్ల పైకి రానున్న ఆర్ర్టీసి బస్సులు. బస్సుల్లో 50 శాతం సీట్లకే ప్రయాణికులకు అనుమతి నివ్వగా అలాగే ప్రతీ బస్సుల్లోనూ శానిటైజర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు విధుల్లోకి కార్మికులకు చేరే టప్పుడు డిపోల్లో థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతి అని తెలిపారు.
కాగా ప్రస్తుతానికి ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వరకూ బస్సులకు పర్మిషన్ అని, అంతరాష్ట్ర సర్వీసులు లేవని స్పష్టం చేసింది ఆర్టీసీ. అలాగే వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, నల్గొండ వైపు వెల్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్ నగర్ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడిపే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించాక మాత్రమే దీనిపై తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: వెనక్కి తగ్గిన ఏపీ ఎస్ ఆర్టీసీ ఎవరినీ తొలగించబోము