Wednesday, December 1, 2021

Latest Posts

జీతాలకు డబ్బుల్లేవ్ అంటున్న టీటీడీ అధికారులు

ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవట… తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతున్న మాట ఇదీ. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఆ దేవుడు.. రోజుకు రూ.2 కోట్లుకు తగ్గకుండా విరాళాలు వస్తుంటాయి.. అదీ హుండీ ఆదాయం మాత్రమే.. ఆపై వచ్చే విలువైన విరాళాలు, కానుకలకు లెక్కే లేదు.. కానీ, ఇప్పుడు ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవట. తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతున్న మాట ఇదీ.

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో గత 45 రోజులుగా తిరుమలకు భక్తుల రాకపోక లేదు. విరాళాలు లేకుండా పోయాయి. దీంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ దెబ్బకు రూ.400 కోట్ల రెవెన్యూ కోల్పోయామని, ఇప్పుడు రోజూ వారీ ఖర్చులు భరించడానికి కూడా ఇబ్బంది అవుతోందని అంటున్నారు. సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. అయితే, టీటీడీ వద్ద 8 టన్నుల బంగారం ఉంది. రూ.14వేల కోట్ల ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ డబ్బు, బంగారం ముట్టుకోకుండా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని అంటున్నారు టీటీడీ అధికారులు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss