Wednesday, June 23, 2021

Latest Posts

శ్రీవారి హుండీకి కొత్త రికార్డ్, ఎన్ని కోట్లంటే!

TTD Hundi Receives Record Amount

తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి వారి హుండీకి కళ్లు చెదిరే ఆదాయం వచ్చింది. శ్రీవారిని 42,825 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు, 8,340మంది తలనీలాలు సమర్పించారు. కాగా రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీకి రూ.4.3కోట్లు ఆదాయం వచ్చింది. ఇటీవల కాలంలో, లాక్‌డౌన్‌ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. ఈ నెలలో ఐదోసారి శ్రీవారి హుండీ ఆదాయం రూ.3కోట్లు దాటింది. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది. అలాగే ఈ నెల 25 నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులు అవకాశం ఇవ్వడంతో హుండీ ఆదాయం మరింతపెరిగే అవకాశం ఉంది.

నిన్న వైకుంఠ ఏకాదశి కావడంతో.. తిరుమలలో భక్తుల రద్దీ కనింపించింది. కరోనా, లాక్‌డౌన్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఎక్కువమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున 4.30 గంటల నుంచి భక్తులను వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ వారి దర్శనానికి అనుమతించారు. తిరుమల చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 25న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వర్ణరథోత్సవం, 26న ద్వాదశిని పురస్కరించుకుని పుష్కరిణి తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss