తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను… రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లో కలపాలన్న టీటీడీ పాలకమండలి నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు. భౌతికదూరం పాటిస్తూ ఆందోళన కొనసాగించారు. పాలకమండలి నిర్ణయంతో తమకు అందే ప్రయోజనాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: