‘‘పేద రాష్ట్రానికి మండలి అవసరమా?’’ అంటూ శాసనమండలిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు, మహిళలకు వ్యతిరేకంగా వాదించడానికి రూ.5 కోట్లతో అడ్వకేట్ను ఏర్పాటు చేయడం అవసరమా అని ఆయన మండిపడ్డారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపాలన చేయవచ్చా? అని వైసీపీ నేతల తీరుని ఎండగట్టారు. పెద్దల సభ న్యాయం చేయకపోవడం నిజంగా దుర్మార్గమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం అత్యంత దారుణమని అయన పేర్కొన్నారు.
నిజానికి సెలెక్ట్ కమిటీకి పంపితే మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని డాక్టర్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగకుండా, విభజన చట్టంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలుకాకుండా శాసన మండలి అడ్డుకుందా అని ప్రశ్నించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా పెద్దల సభ ఎటువంటి నిర్ణయాలు చేయలేదన్నారు.పెద్దల సభలో తాబేదార్లు అని మంత్రి బొత్స సత్యనారాయణ అనడాన్ని శాసనమండలి చరిత్రకు కళంకమ ని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ముఖ్యంగా గతంలో రద్దైన శాసన మండలిని జులై 8న 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన కానుకగా శాసనమండలిని పునరుద్ధరించారని డాక్టర్ తులసి రెడ్డి చెప్పారు. పార్లమెంట్ నిర్ణయం ప్రకారమే రద్దు అవుతుందనే విషయం వైసీపీ నేతలకు అర్థం కాలేదని.. శాసనసభ తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే శాసనమండలని వ్యాఖ్యానించారు. చారిత్రక తప్పిదం చేసి, చరిత్ర హీనులు కావద్దని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.