Wednesday, June 23, 2021

Latest Posts

ట్విట్టర్ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం

కరోనా కు బయపడి ఇప్పటికే కొన్ని ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేసింది. తాజాగా ఆ లిస్ట్ లో  ట్విట్టర్ కూడా చేరింది. కరోనావైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన ట్విట్టర్ వర్క్ కల్చర్ నచ్చడంతో ప్రపంచ వ్యాప్తంగా కొందరు ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాపారాలు సాగడానికి లాక్‌డౌన్ కఠినంగా ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి దాంతో సోషల్ మీడియా కంపెనీ అయిన ట్విట్టర్ సెప్టెంబరు వరకూ ఆఫీసులు ఓపెన్ చేసే ప్రసక్తే లేదని ముందుగానే తెలిపింది.

కానీ ఇప్పుడు కరోనా సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించామని వెల్లడించింది.  కరోనా సమయంలో ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం శాశ్వతంగా కొనసాగించాలని కోరడంతో అనుమతించినట్టు ట్విట్టర్ తెలిపింది. అయితే దానికి తాము అంగీకారం తెలిపినట్టు ట్విట్టర్ వెల్లడించింది.  లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తిరిగి తమ కార్యాలయాలను తెరుస్తాం అని కార్యాలయాలు తెరిచిన తర్వాత కూడా  తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటాం కానీ ఉద్యోగులు ఎప్పటి నుంచి తిరిగి ఆఫీసుకు వస్తారన్నది ఉద్యోగులు నిర్ణయమే అని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: జూమ్ ను రిప్లేస్ చేస్తానంటున్న ఫేస్‌బుక్‌ “మెసెంజర్ రూమ్స్”

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss