Wednesday, April 21, 2021

Latest Posts

సోషల్ మీడియా వేదికగా స్టార్ వార్

twitter war between the maheshbabu and vijay fans

టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా అభిమానుల మధ్య అస్సలు పొసగదు. అందునా  అగ్ర హీరోలకు చెందిన అభిమానుల మధ్య అయితే అసలు చెప్పక్కర్లేదు.  మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అనుకునే మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒక‌ప్పుడు ఓ భాష‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ ఫ్యాన్ వార్ ఇప్పుడు స‌రిహ‌ద్దులు దాటేస్తోంది.

ఫాన్స్ మధ్య వార్ కి  సోష‌ల్ మీడియా  వేదిక అవుతోంది. అందుకే   సోషల్ మీడియా  వేదికగా ఇత‌ర భాష‌ల హీరోల‌కు సంబంధించిన ఫ్యాన్ వార్స్ జ‌రుగుతున్నాయి. తాజాగా అలాంటి ఫ్యాన్ వార్ సోష‌ల్ మీడియాలో భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు, కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ విజ‌య్ అభిమానుల మ‌ధ్య చోటు చేసుకుంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మ‌హేశ్‌ను టార్గెట్ చేసిన విజ‌య్ అభిమానులు డ‌మ్మీ స్టార్ మ‌హేశ్ బాబు అని కామెంట్ చేశారట. మరి  మ‌హేశ్ అభిమానులు ఊరుకుంటారా? అందుకే  విజ‌య్‌ను టార్గెట్ చేసి రీమేక్ స్టార్ విజ‌య్ అంటూ తిట్టారు. నిజానికి హీరోల మ‌ధ్య మంచి స్నేహమే ఉంటుంది. అది అర్థం చేసుకోలేని ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక మాధ్య‌మం ద్వారా గొడ‌వ ప‌డుతూనే ఉంటారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss