Thursday, February 25, 2021

Latest Posts

ఈ దేశంలో యువతులకు రక్షణ ఏది?

Two College Girls Jumped From Running Bus

యువకుల ఎగతాళి మాటలతో భయాందోళనకు గురైన ఇద్దరు కాలేజీ యువతులు రన్నింగ్‌లో ఉన్న బస్సులోనుంచి కిందకు దూకేశారు. దీనితో ఆ ఇద్దరు యువతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రన్‌హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్ధినులు సొంత గ్రామానికి వెళ్లటానికి గురువారం పది గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ బస్సు ఎక్కారు.

బస్సు ముందు సీట్లలో యువకులు కూర్చుని ఉండటంతో వారు వెళ్ళి వెనకాల సీట్లలో ఈ కాలేజీ విధ్యార్ధినులు కూర్చున్నారు. ఇక తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్‌ దగ్గరకు వెళ్లి.. ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్‌ అందుకు ఒప్పుకోలేదు పైగా బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు.

దానికి తోడు ముందు సీట్లలో కూర్చుని ఉన్న యువకులు అల్లరి చేయడం ప్రారంబించారు. ఈ రోజు బస్సు మీ ఊర్లో ఆగదు. ఇక చూడు! భలే సరదా ఉంటుంది అనటం ప్రారంభించారు. దీంతో భయాందోళనకు గురైన యువతులు మరోసారి డ్రైవర్‌ను బస్ ను ఆపేయమని ప్రాథేయపడ్డారు. అయినప్పటికీ ఆ బస్ డ్రైవర్ ఆపకపోవటంతో వారు బస్సులోనుంచి కిందకు దూకేశారు. దీనితో వీరు  తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన పై బాధిత యువతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే డ్రైవర్‌ సదరు యువతుల కుటుంబాలతో రాజీ పడటంతో గొడవ సద్దుమణిగింది. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో యువతులకు రక్షణ లేదని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss