Thursday, December 2, 2021

Latest Posts

మరో ఇద్దరు భారత క్రికెటర్లకు కరోనా

Two More Indian Players Test Positive

శ్రీలంకలో పర్యటిస్తున్న మరో ఇద్దరు భారత క్రికెటర్లు కోవిడ్ పాజిటివ్ గా తేలారు. మొన్న కృనాల్ పాండ్య కి కరోనా రావడంతో అతనికి దగ్గరగా ఉన్న 8 మందిని ఐసోలేషన్ లో ఉంచారు. అయినప్పటికీ వారిలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో ఒకరు స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కాగా మరొకరు కృష్ణప్ప గౌతమ్. దీనితో వీరంతా శ్రీలంకలోనే ఐషోలేషన్ ఉండనున్నట్లు సమాచారం.

చాహల్ మరియు గౌతమ్‌తో పాటు మరో ఆరుగురు(సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, పృథ్వీ షా, ఇషాన్ కిషన్ మరియు దీపక్ చాహర్) కూడా ఐషోలేషన్ లోనే ఉన్నారు. ఆగష్టు 4 నుంచి జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్ ని టెస్ట్ టీం కి సెలెక్ట్ చేశారు. అయితే వారు ఐసోలేషన్ లో ఉండడంతో వేరే ప్లేయర్లను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. తాజాగా శ్రీలంకతో ముగిసిన టి 20 సిరీస్ లో భారత్ 2-1 తో పరాజయం పాలయ్యింది.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss