Sunday, June 20, 2021

Latest Posts

రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పుట్టిన రోజు నాడు పండుగే

Ramcharan Birthday

ఈ శనివారం, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భముగా అభిమానులు పండుగ చేసుకొనున్నారు. రామ్ చరణ్ యొక్క సరికొత్త పోస్టర్‌ను ఆవిష్కరిస్తామని “ఆర్‌ఆర్‌ఆర్” మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రామరాజు యొక్క కొత్త లుక్ విడుదల అవుతుంది. అలానే అతని అభిమానులు మార్చి 26 న హైదరాబాద్ లోని శిల్ప కళా వేడికాలో పెద్ద వేడుకలు నిర్వహించబోతున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందంతో పాటు, “ఆచార్య” మేకర్స్ కూడా రామ్ చరణ్ యొక్క ఫస్ట్ లుక్‌ను ఆ రోజున విడుదల చేయబోతున్నట్టు సమాచారం. దీనితో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ శనివారం డబుల్ ట్రీట్ దొరికే అవకాశం కనిపిస్తుంది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటించారు. అతని తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పాత్రలో నటించారు. చరణ్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుండి రెండు పోస్టర్లు అభిమానులను కనువిందు చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss