Saturday, March 6, 2021

Latest Posts

ఉద్ధ‌వ్ ఠాక్రేకు గట్టెక్కిన గండం

రాజ‌కీయంలో ఎవ‌రైనా సీఎం కావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ‌తారు, వార‌స‌త్వంతో రాజ‌కీయంలోకి వ‌చ్చిన వారికి ఎమ్మెల్సీ కావ‌డం అనేది ఏ మాత్రం క‌ష్టం కాదు! రాజ‌కీయ వార‌సుల‌కు కూడా సీఎం కావ‌డం అనేది తేలిక కాదు, వాళ్లు సుల‌భంగా ఎమ్మెల్సీలైతే కాగ‌ల‌రు. అయితే శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రేకు మాత్రం క‌థ రివ‌ర్స్ లో సాగింది. అనూహ్యంగా మ‌హారాష్ట్ర సీఎం అయిన ఠాక్రే, ఎమ్మెల్సీ కావ‌డం మాత్రం ఉత్కంఠ‌భ‌రిత వ్య‌వ‌హారంలా సాగింది.  రాజ‌కీయం ఎప్పుడూ ఒక‌లాగా ఉండ‌దు!

ఒక‌వైపు క‌రోనా మ‌రోవైపు ముగుస్తున్న గ‌డువు కాలం.. వీటితో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన ఉద్ధ‌వ్ ఠాక్రే కు ఇప్పుడు రిలీఫ్ ల‌భించిన‌ట్టుగా ఉంది. ఎట్ట‌కేల‌కూ ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. పోటీ లేక‌పోవడంతో మ‌హారాష్ట్ర‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా పూర్త‌య్యేలా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఠాక్రే ఎమ్మెల్సీగా నామినేట్ అయిన‌ట్టే, దీంతో ఆయ‌న ప‌ద‌వికీ ఆరు నెల‌ల గండం త‌ప్పిన‌ట్టే అని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తూన్నారు.

గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా సీఎం ఉద్ధవ్‌ను నామినేట్ చేయాలంటూ మహా కేబినెట్ గవర్నర్ కోషియారీకి విన్నవించిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ కోషియారీ వివిధ కారణా రీత్యా జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో గవర్నర్ వర్సెస్ శివసేనగా రాజకీయాలు మారిపోయాయి. చివరకు సీఎం ఉద్ధవ్ ప్రధాని మోదీ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఈ పరిణామం తర్వాత తొమ్మిది స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పడంతో గవర్నర్ పచ్చ జెండా ఊపారు. బీజేపీ నలుగురు అభ్యర్థులను, ఎన్సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు… ఇలా బరిలోకి దిగారు. కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చివరికి ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించడంతో సీఎం ఉద్ధవ్‌కు లైన్ క్లియర్ అయింది.

ఇది కూడా చదవండి: సిఎం పళనిస్వామికి రజనీకాంత్ వార్నింగ్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss