Thursday, December 2, 2021

Latest Posts

నేడు మల్లన్న సేవలో అమిత్‌ షా

Union home minister amit shah to visit srisailam today

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు(గురువారం) కుటుంబసభ్యులతో సహా ఆంధ్రప్రదేశ్‌ శ్రీశైలంలోని భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు.  నేటి ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకొని మధ్యాహ్నం 12.25 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంటలో దిగి అక్కడ నుండి రోడ్డు మార్గంలో వెళ్లి మధ్యాహ్నం 12.45-1.45 మధ్య మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు.

అనంతరం భ్రమరాంబ అతిథి గృహంలో మధ్యాహ్నం భోజనం చేసి మధ్యాహ్నం 3.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి చేరుకుని ఢిల్లీ బయలుదేరతారని కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. అమిత్‌షాకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్‌ రాష్ట్ర దేవదాయ శాఖ తరుఫున స్వాగతం పలకునున్నారు.

ఇది కూడా చదవండి:                                                           

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss