Monday, March 8, 2021

Latest Posts

పవన్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి స్పందన  

Union minister muralidhar rao response to Pawan’s appeal

కరోనా మహమ్మారి వేళలో  పలు సమస్యలపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయా ప్రభుత్వాలకు చేస్తున్న విజ్ఞప్తికి అక్కడి ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. మత్సకారుల సమస్యలపై చేసిన విజ్ఞప్తికి తమిళనాడు సర్కార్ స్పందించడమే కాదు, సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు తమిళనాడు సీఎం ఫళ ని స్వామి కృతజ్ఞతలు కూడా పవన్ కి తెలిపారు. అందుకు పవన్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే రెండు మూడు సమస్యలపై పవన్ స్పందిస్తూ ఆయా ప్రభుత్వాలకు విన్నవించారు.

తాజాగా జనసేన అధినేత పవన్ చేసిన విజ్ఞప్తికి  కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్పందించారు. యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సహాయం అందించాలని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని కోరారు. కేంద్ర మంత్రి పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా యూకేలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

విద్యార్థులకు అవసరమైన ఆహారం, వసతి సమకూరుస్తామని మంత్రి తెలిపారు. కరోనా వ్యాప్తి మూలంగా వారు, వారి తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారనే విషయం పవన్ ద్వారా తెలిసిందని కేంద్ర మంత్రి చెప్పారు. లండన్‌లో ఉన్న హై కమిషన్ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని, వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటామని కేంద్రమంత్రి మురళీధరన్ భరోసా ఇచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss