Saturday, January 16, 2021

Latest Posts

అల్లూరి సీతారామరాజు గురించి తెలియని నిజాలు

Unknown facts about Alluri Sitaramaraju movie

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో వెరీ స్పెషల్ మూవీ అనగానే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంది. కృష్ణ వందవ సినిమాగా ఇది తెరకెక్కింది. తెలుగులో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన అల్లూరి సీతారామరాజు . 1974 మే 1న విడుద‌లై 46 ఏళ్లను పూర్తి చేసుకుంది. సినిమా విడుదలైన ఫస్ట్ షోకే సూప‌ర్‌హిట్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాకు ఆదినారాయణ రావు అందించిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. ముఖ్యంగా తెలుగువీర లేవరా పాటకు తొలిసారిగా జాతీయ స్థాయిలో అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ గేయ రచయతగా శ్రీశ్రీ కి అవార్డు వచ్చింది. ‘అసాధ్యుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా ఓ నాటకంలో కనిపించాడు. ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేసిన వి.రామచంద్రరావు దర్శకత్వంలోనే అల్లూరి సీతారామరాజు మూవీ స్టార్ట్ అయింది. ఈ చిత్రం 70 షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్ర దర్శకుడు వి.రామచంద్రరావు అకాల మరణం చెందడంతో మిగిలిన సినిమా యాక్షన్ సీన్స్‌ కే.యస్.ఆర్. దాస్ తెరకెక్కించారు.

అంతకు ముందు ఎన్టీఆర్,కృష్ణలతో ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా వి.రామచంద్రరావు తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితంలో 350 పైగా సినిమాలు చేసినా.. అందులో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాక హీరోగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి చారిత్రక చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. నిజానికి అందరి కంటే ముందుగా ఓ నిర్మాత శోభన్ బాబు హీరోగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేయించారు. కానీ కుదరలేదు. ఇరాక్ ‘అల్లూరి సీతారామరాజు ’సినిమా ఎన్టీఆర్ చేయాలని ఎన్నో రోజులుగా అనుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు,రచయిత పడాల రామారావుతో రాజమండ్రిలోనే ఎన్టీఆర్ చర్చించారు.

అంతా ఒకే అనుకున్నాక ఎందుకో ఆయన తీయలేకపోయిన తరుణంలో కృష్ణ ముందుకొచ్చి అదే కథతో ధైర్యంగా తీశారు. అయితే ఆ పాత్రపై ఎన్టీఆర్ కి మక్కువ పోలేదు. అందుకే సర్ధార్ పాపారాయుడు, ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాల్లోని పాటల్లో ‘అల్లూరి సీతారామరాజు’గా ఎన్టీఆర్ కనిపించి సందడి చేసారు. కృష్ణ తన స్వీయ నిర్మాణ సంస్థ పద్మాలయ సంస్థపై అల్లూరి సినిమా నిర్మించారు. త్రిపురనేని మహారథితో ఆరుగురి సభ్యులను మన్యం ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ సిద్ధం చేసారు. అల్లూరి సీతారామరాజు సినిమాకు త్రిపురనేని మహారథి అద్భుతమైన మాటలు రాసారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఇక ఇన్‌డోర్ సన్నివేశాలను వాహినీ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ వేసారు. చింతపల్లి అడవుల్లో 38 రోజుల పాటు ఔట్ డోర్ షూట్ చేసారు. ఇప్పటికీ అల్లూరి పాత్రకు డిమాండ్ ఉంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ లో సీతారామరాజు గెటప్ కూడా జక్కన్న పెడుతున్నాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss