Home రాజకీయం అన్ లాక్ 1.0 మార్గ దర్శకాలు

అన్ లాక్ 1.0 మార్గ దర్శకాలు

Unlock 1.0 Guide LInes, Unlock 1.0 Safter Measures, Unlock the Lockdown, Corona Guidelines, Corona Portection Measures, Unlock 1.0 Inida

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ 5.0 కొనసాగుతోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 1.0(భారీ సడలింపు)ను అమలు చేస్తోంది. తాజాగా సడలింపుల విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రార్థన మందిరాలు, పని ప్రదేశాలు, రెస్టారెంట్లలో పాటించాల్సిన నిబంధనలు మార్గదర్శకాల్లో పేర్కొంది. పని ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి, కార్యాలయాల్లో ప్రదేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజేషన్‌ తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో 6 అడుగుల దూరం పాటించాలి. ఏళ్ల పైబడిన వారు, గర్భిణీలు, పదేళ్లలోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలి. రెస్టారెంట్లలోకి కరోనా లక్షణాలు లేని ఉద్యోగులు, కస్టమర్లకు మాత్రమే అనుమతి, రెస్టారెంట్‌ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌.. శానిటైజేషన్‌ తప్పనిసరి, రెస్టారెంట్‌లో, పార్కింగ్‌ ప్రాంతంలో కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా చూడాలి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌లో కూడా భౌతిక దూరం పాటించాలి. ప్రార్థనా మందిరాల్లోకి వచ్చే ముందు భక్తులు చేతులు, కాళ్లను సబ్బుతో కడుక్కోవాలి. విగ్రహాలను, పుస్తకాలను తాకడం నిషేధం. సామూహిక ప్రార్థనలు, సంగీత కచేరీలకు అనుమతి లేదు.

ఇది కూడా చదవండి: 

Exit mobile version