Tuesday, May 18, 2021

Latest Posts

చైనాలోనూ ఆగని కరోనా మరణాలు  

Unspecified Corona Deaths in China

ఎక్కడైతే కరోనా పుట్టిందో అక్కడ ఇంకా కరోనా కంట్రోల్ లోకి రాలేదు. అవును  కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్‌ల్యాండ్ చైనాలో కొత్తగా 31 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఇద్దరు రోగులకు స్థానికంగా కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యుల పరీక్షల్లో తేలింది. మెయిన్‌ల్యాండ్ చైనాలో కొత్తగా నలుగురు కరోనా వైరస్‌తో మరణించారు. మొత్తంమీద చైనా దేశంలో 81,322 మందికి కరోనా వైరస్ సోకగా,  వీరిలో 3,322 మంది మరణించారు.మూడు నెలలు దాటినా చైనాలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గక పోవడంతో చైనా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇక కరోనా  ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. మరీ ముఖ్యంగా.. యూరప్‌ ఖండాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక  ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. గురువారం నాటికి నమోదైన 10 లక్షల కేసుల్లో ఐదు లక్షలకు పైగా కేసులు ఒక్క యూరప్‌ ఖండంలోనే నమోదయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30 గంటలకు కరోనా మృతుల సంఖ్య 51 వేలు దాటింది. వారిలో దాదాపు 35 వేల మంది యూర్‌పవాసులే. కరోనా మరణాల్లో సగానికిపైగా ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లోనే నమోదయ్యాయి. ఇటలీలో కరోనాకు బలైనవారి సంఖ్య 13,155కు చేరగా, స్పెయిన్‌లో 10 వేలు దాటింది.  నిన్న ఒక్కరోజే  616 మంది కరోనా బాధితులు స్పెయిన్‌లో ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌ తర్వాత అత్యధికంగా యూకేలో ఒక్క రోజే 569 మంది, బెల్జియంలో 183 మంది చనిపోయారు.

కాగా  బెల్జియంలో మృతుల సంఖ్య మూడు రోజుల్లో రెట్టింపు అయ్యాయి. నెదర్లాండ్స్‌లో ఒక్కరోజులో 166 మంది, స్వీడన్‌లో 43, జర్మనీలో 28, పోర్చుగల్‌లో 22, స్విట్జర్లాండ్‌లో 17 మంది చనిపోయారు. యూర్‌పలో సంభవిస్తున్న మరణాల్లో 95 శాతం 60 ఏళ్ల పైబడినవారివేనని, ఆ 95 శాతంలో కూడా సగం మంది 80 ఏళ్లు దాటినవారేనని యూర్‌పలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం ప్రకటించింది. అదేసమయంలో యువత కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారని అభిప్రాయపడింది.  ఇరాన్‌లో.. ఇజ్రాయెల్‌లో, ఇరాన్‌లో కూడా గురువారం ఒక్కరోజే 124 మంది చనిపోయారు. అక్కడ మృతుల సంఖ్య 3,160కి పెరిగిం ది. ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రికి కూడా కొవిడ్‌-19 సోకింది.  ఇప్పటికే ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కొద్దిరోజులుగా స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss